గ్లోబల్ డిప్లొమాటిక్ కౌన్సిల్ (జీడీసీ) ఫార్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్ రాయబారిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ రష్మీ ఠాకూర్ నియామకమయ్యారు. అలాగే జీడీసీ వుమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ లైఫ్ స్టైల్ డైరెక్టర్‌గా కూడా ఆమె నియామకయ్యారు. ఈ మేరకు జీడీసీ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యోనన్ ఎ.సి.బయర్డె.. డాక్టర్ రష్మీ ఠాకూర్‌ను ఆయా పదవుల్లో నియమిస్తూ నియామక పత్రాలను జారీ చేశారు.
డాక్టర్ రష్మీ ఠాకూర్ ఇప్పటికే ప్రేరణ ఉపన్యాసకురాలిగా పనిచేస్తున్నారు. తన ప్రసంగాలతో అందరికీ ప్రేరణ అందిస్తున్నారు. అలాగే బ్యూటీ కాంటెస్టులు నిర్వహిస్తున్నారు. అనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. జీడీసీలో ఆమె ఆయా పదవుల్లో నియామకం అవడంతో ఇకపై ఆమె సంబంధిత ప్రాంతాల్లోని మహిళా సాధికారత కోసం పనిచేయనున్నారు. ఇక ఫార్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్‌లలో జరిగే కార్యక్రమాలలో ఆమె జీడీసీ తరఫున అధికార ప్రతినిధిగా పాల్గొననున్నారు.
గ్లోబల్ డిప్లొమాటిక్ కౌన్సిల్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతోంది. ఐక్యరాజ్యసమితి, యురోపియన్ యూనియన్ అండ్ కామన్వెల్త్ తదితర సంస్థలతో కలసి పనిచేస్తోంది. ఈ క్రమంలో జీడీసీ ఇప్పటికే పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఇక తాజాగా నియామకమైన డాక్టర్ రష్మీ ఠాకూర్ కూడా జీడీసీ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు మహిళా సాధికారత కోసం జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.