బంపర్ ఆఫర్… మాల్యా మార్క్ సెటిల్మెంట్ రెడీ.. !

-

లిక్కర్ కింగ్ విజయ మాల్యా వ్యవహారం మామూలుగా లేదు. ఆయన భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే విజయ మాల్యా తాజాగా మరో ప్రతిపాదన పెట్టాడు. అది ఇప్పుడు బంపర్ ఆఫర్ అంటూ నెట్ లో వైరల్ అవుతోంది.

 

విజయ మాల్యా ముఖ్యంగా తాను… శిక్షనుంచి తప్పించుకొనే మార్గాలన్నీ మూసుకు పోయాయి. దీంతో ఏవిధంగానైనా సరే శిక్ష తప్పించుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. శిక్ష అనుభవించేందుకు ఏమాత్రం ఇష్టంలేని విజయ మాల్యా బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్‌మెంట్‌ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్లు సమాచారం అందుతోంది. అలాగే.. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించనుంది అనే ఈ సమయంలో ఇలా కొత్త ఎత్తుతో మాల్యా ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే మాల్యా ఇలాంటి ఆఫర్‌ ఇవ్వడం ఇదేం తొలిసారి కాదని.. బ్యాంకుల కన్సార్షియంతో మాల్యా ఇదివరకటి ఆఫర్లను ఇప్పటికే తిరస్కరించింది. మరి తాజా ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.

అయితే డైరెక్ట్ గా బ్యాంకులతోనే పరిష్కరించుకొనేందుకు మాల్యా రెడీగా ఉన్నట్లు మాల్యా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు వెల్లడించారు. అయితే అందుకు పరిష్కారం మొత్తం ఎంత ప్రతిపాదించారు అనే విషయంపై క్లారిటీ రావడం లేదు గానీ… ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు రుణాలు, వాటిపై ఇప్పటి వరకు వచ్చిన వడ్డీతో కలిపి 13,960 కోట్లు రూపాయలను చెల్లిస్తామంటూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

అయితే 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేశారనే ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. దీంతో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అలాగే… మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని.. వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ స్పష్టం చేసింది. కాగా శరణార్ధిగా దేశంలో ఉండేందుకు అంగీకరించాలంటూ బిట్రన్‌ ప్రభుత్వాన్ని మాల్యా కోరిన విషయం కూడా విదితమే.

Read more RELATED
Recommended to you

Latest news