కుక్కను రేప్ చేసిన తాగుబోతు..!

-

మద్యం తాగిన మనిషి మృగంతో సమానం అంటారు. ఎందుకంటే.. ఆ మత్తులో ఏం చేస్తున్నారో వారికే తెలియదు. విచక్షణ రహితంగా వారి ప్రవర్తన ఉంటుంది. ఆ సమయంలో వావివరుసలు.. బంధుత్వాలు.. వయసు వంటి బేధాలు ఏమీ చూడరు. కామ వాంఛ తీర్చుకునేందుకు క్రూరంగా ప్రవర్తిస్తారు కొందరు. ఇది ఇన్నాళ్లు మహిళలు.. బాలికలపై జరుగుతోంది. కానీ మరికొందరు జంతువులను కూడా వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఇదే జరిగింది.

ఓ ఆడకుక్కపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. థానేలోని వాగ్గే ఎస్టేట్లో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఆడకుక్కపై అత్యాచారం చేశాడు. అలా చేస్తున్న దాన్ని కొందరు చూసి పట్టుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. మద్యం మత్తులో ఆ వ్యక్తి శునకంపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news