దృశ్యం 3 కోసం క్లైమాక్స్ సిద్దం.. సీక్వెల్ తీసే పనిలో డైరెక్టర్

దృశ్యం సినిమా.. మళయాళంలో విజయవంతమై తమిళ, తెలుగు, కన్నడ, హిందీ  భాషల్లో రిమేక్ అయి విజయం సాధించింది. ఇప్పటికే దృశ్యం సినిమాకు దృశ్యం2 రూపంలో సీక్వెల్ వచ్చింది. మళ్లీ మరో సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిన దృశ్యం2 తెలుగు మూవీ సక్సెస్ అందుకుంది. దీని కన్నా ముందు మళయాళంలో మోహన్ లాల్ దృశ్యం2 లో సినిమాను తీశారు. అక్కడ కూడా విజయం సాధించింది. ప్రస్తుతం కన్నడలో రవిచంద్ర హీరోగా దృశ్య 2 విడుదలకు సిద్ధం అయింది.

తాజాగా దృశ్యం3 మూవీని తెరకెక్కించేందుకు డైరెక్టర్ జీతూ జోసెఫ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ చేసుకున్నట్లు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. ఈ క్లైమాక్స్ సీన్ల గురించి మోహన్ లాల్ తో చర్చించాడట జీతూ జోసెఫ్. ఇప్పటికే రెండు సీక్వెన్సులుగా వచ్చిన దృశ్యం, దృశ్యం2 లు అటు మళయాళం ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంద. అభిమానుల దగ్గర నుంచి కూడా దృశ్యం3 తీయాలని  కోరుతున్నారు. మోహన్ లాల్ ఓకే చెప్పితే దృశ్యం3 పట్టాలేక్కే అవకాశం ఉంది.