వరి ఉరి కాదు… రైతుల పాలిట సిరి అని… యాసంగి లో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి పంటను కొనాల్సిందేనని… బీజేపీ మాజీ ఎమ్మెల్యే Nvss ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ ఛార్జ్ ల పెంపు ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తుందని… ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులని టీఆర్‌ఎస్ నేతలు అతి తక్కువ ధరలకు లీజు లకు తీసుకున్నారు.. ఆ లీజు లను ప్రస్తుత మార్కెట్ ధరలకు పెంచాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ వాడే డీజిల్ పై వ్యాట్ ను తగించాలన్నారు. వరి విషయం లో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని… వానాకాలం పంట ను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని నిప్పులు చెరిగారు. రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ దే బాధ్యత అని… రైతుల తో చెలగాటం ఆడుతున్నారు. .. దాన్యం దళారీలకు అమ్ముకోవాలని కుట్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ రైతుల పాలిట రాబంధు అని ఫైర్ అయ్యారు. వ్యవసాయ మంత్రి కి ఏ పంట ఎప్పుడు వస్తుందో ఇంగిత జ్ఞానం ఉందా ? వ్యవసాయం గురించి తెలియని కేటీఆర్ కూడా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు Nvss ప్రభాకర్.