దుబ్బాక ఉప ఎన్నిక.. కాంగ్రెస్ కి భారీ షాక్..!

-

దుబ్బాక ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక తమ పాలనకు దుబ్బాక ఉప ఎన్నిక నిలువుటద్దంగా మారుతున్న నేపథ్యంలో… ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది టిఆర్ఎస్ పార్టీ. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగి ఇతర పార్టీ నేతలు అందరిని ఆకర్షించే పనిలో పడ్డారు. అంతేకాకుండా దుబ్బాక లో ఉన్న అసంతృప్తి జ్వాలను కూడా చల్లార్చే పనిలో నిమగ్నమయ్యారు మంత్రి హరీష్ రావు.

ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్ ఇచ్చింది టిఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ను వదిలి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవలే మంత్రి హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన నాగేశ్వర్ రెడ్డి… టీఆర్ఎస్ గెలుపుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి మిగతా పార్టీల నేతలు సైతం ఆకర్షితులై పార్టీలోకి వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news