జల్సా రాముడు.. షాంపైన్ తాగాడు.. నోటికి పనిచెప్పాడు!!

-

గతకొన్ని రోజులుగా ఏపీలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారం వివాదాస్పదంగా ఉన్న సంగతి తెలిసిందే! అయితే తాజాగా ఆయనకు సంబందింఛిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. రఘు రామకృష్ణం రాజు ఓ పార్టీలో ఒక అందమైన రష్యన్ డ్యాన్సర్ మీద నుంచి షాంపైన్ పోస్తుండగా.. రఘురాముడు ఆబగా, ఆతృతగా తాగుతున్న ఫొటో అది! తాజాగా ఈ ఫోటోపై ఆర్.ఆర్.ఆర్. స్పందించారు!


అయితే ఈ ఫోటో వైరల్ అవ్వడంపై స్పందించిన ఆర్.ఆర్.ఆర్. నోటికి పని చెప్పారు. మూడేళ్ల క్రితం జరిగిన ఒక ఫంక్షన్ ‌లో తీసిఇన ఫోటో ఇది అని మొదలుపెట్టిన ఆయన.. “అందులో ఉన్నది నేనే. ఇందులో నేను ఎవరినీ ముట్టుకోలేదు. షాంపేన్ తాగాను. క్రికెట్ ‌లో క్రీడాకారులు తాగుతుంటారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీ ఇచ్చిన ఫంక్షన్ ‌లో తీసిన ఫొటో ఇది. అక్కడున్న అమ్మాయి అందరి నోళ్లలో పోసింది.. నా నోట్లో కూడా పోసింది! అందరి ఫంక్షన్‌ లలో రష్యన్ అమ్మాయిలు రావడం సహజమైపోయింది. అల్లంత దూరంలో ఆ అమ్మాయి అలాగా షాంపేన్ పోస్తే… ఉన్మాదుల్లారా, పిచ్చి వెధవల్లారా, ఏదో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు!” అంటూ చెలరేగిపోయారు ఆర్.ఆర్.ఆర్.!

ప్రజలను పాలిస్తున్న మన ఎంపీలు పార్టీలు చేసుకుంటే ఈ రేంజ్ లో ఉంటుందా అని ముక్కుమీద వేలేసుకుంటున్నారు ఈ ప్రజాస్వామ్యంలోని పాలకుల అభిమానులు!!

Read more RELATED
Recommended to you

Latest news