నెట్టింట్లో వైరల్ అవుతున్న మహేశ్‌ బాబు ఫ్యామిలీ ఫొటోస్…!

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హీరో కృష్ణ కుమార్తె ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకను.. కుటుంబసభ్యులంతా కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్‌చేసుకున్నారు.

హీరో కృష్ణ దంపతులు, మహేష్‌ దంపతులు, ఎంపీ గల్లా జయ్‌దేవ్‌ సహా కుటుంబసభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ప్రియదర్శినితో కేక్‌ కట్‌ చేయించి.. ఫొటోలకు ఫోజిచ్చారు. తన భార్య పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు హీరో సుధీర్‌బాబు. ఘట్టమనేని కుటుంబంతా ఒక్కచోట కలిసి ఉన్న ఈ ఫొటోకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి.