తెలంగాణా రాజకీయ వర్గాల్లోనే కాక సామాన్య ప్రజల్లో కూడా దుబ్బాక ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. సామాన్యంగా అయితే ఎక్కడైనా అభ్యర్థి చనిపోతే ఆ కుటుంబాల వారికి సీటు ఇచ్చిన ప్పుడు మిగతా రాజకీయ పార్టీలన్నీ పోటీకి దూరంగా ఉంటాయి. తద్వారా ఆ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. కానీ ఈ దుబ్బాక విషయంలో మాత్రం పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ దుబ్బాక ఉప ఎన్నికలను రాష్ట్రంలో అధికార పార్టీ ఎన్ని టిఆర్ఎస్ అలానే ఎలాగైనా అధికారం చేపట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ఎక్కడ తగ్గడం లేదు.
బిజెపి కూడా తమ సత్తా చూపాలని ప్రయత్నం చేస్తంది. ఈ క్రమంలో మొన్న బీజేపీ అభ్యర్ధి బంధువుల ఇళ్ళ మీద పోలీసులు రైడ్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో బండి సంజయ్ అయితే 24 గంటల దీక్ష కూడా చేశారు. పెద్ద రచ్చ కావడంతో నిన్న బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర గవర్నర్ ను కలిశారు. కలిసి ఈ ఎన్నిక కోసం పోలీస్ అబ్జర్వర్ ని నియమించాలని ఎన్నికల కమిషన్ ని బీజేపీ కోరింది. అలా కోరిందో లేదో వెంటనే ఈరోజు ఎన్నికల కమిషన్ ఓ ఐపీఎస్ అధికారిని దుబ్బాకకు కేటాయించింది. తమిళనాడు క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం.