ఖమ్మంలో మంత్రి,మాజీ ఎంపీల మధ్య ఫ్లెక్సీల రాజకీయం…!

-

ఖమ్మం టీఆర్ఎస్ లో నాయకుల మధ్య వివాదాలు కామన్ గా మారాయి.తాజాగా ఫ్లెక్సీల రాజకీయం ఇప్పుడు మంత్రి అజయ్,మాజీ ఎంపీ పొగులేటి వర్గాల మధ్య సెగలు రాజేసింది. ఖమ్మంలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గత కొంత కాలం నుంచి మళ్లీ స్పీడ్ అయ్యారు. అదే సమయంలో ఆయన పుట్టినరోజు దగ్గరకు రావటంతో వేడుకలు ఘనంగా నిర్వహించాలని అనుచరులు భావించారట. ఇందులో భాగంగా ప్లెక్సీలతో ఖమ్మం నగరాన్ని నింపేందుకు సిద్ధమయ్యారట. ఈ లోపు విజయ దశమి సందర్భంగా మంత్రి అజయ్ ప్లెక్సీలతో నగరాన్ని నింపేసింది పువ్వాడ అజయ్‌ వర్గం.

సోమవారం నాడు దసరా సెలవులను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినప్పటికి, అధికార యంత్రాంగం సమావేశమై ప్లెక్సీలు కట్టకుండా ఆదేశాలను జారీ చేసింది. అంతేకాదు… అనుమతి లేని ప్లెక్సీలని తొలగించనున్నట్లు కూడా ప్రకటించారు. . ఇదంతా పొంగులేటి శ్రీనివాస రెడ్డి బర్త్ డే ప్లెక్సీలు కట్టకుండా చేసేందుకే అనే టాక్‌ వినిపిస్తోంది. పొంగులేటి ప్లెక్సీలకు చెక్ పెట్టేందుకు మాత్రమే ఈ ఆదేశాలు వచ్చాయనే ఆయన అనుచరులు వాపోతున్నారట.

అయితే, అధికారుల నుంచి ఆదేశాలు రావటం ఆలస్యం కార్పొరేషన్ సిబ్బంది రంగంలోకి దిగి నగరంలోని అన్ని ప్లెక్సీలను ఎక్కడికక్కడే చించివేశారు. అందులో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబందించిన ప్లెక్సీలు చాలా ఉన్నాయి. అయితే అక్కడక్కడ మంత్రి పువ్వాడ ప్లెక్సీలను వదిలిపెట్టి మరీ మిగిలిన వాటిని, పొంగులేటి ప్లెక్సీలను చించడంలో ఆంతర్యం ఏమిటనే టాక్‌ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news