దుబ్బాక ఎన్నికల ముందు బీజేపీకి షాక్‌..పార్టీకి రావుల శ్రీధర్‌రెడ్డి రాజీనామా

-

దుబ్బాక ఎప ఎన్నిక ముందు తెలంగాణ బీజేపీకి పెద్దషాక్‌ తగిలింది..బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరికలు జోరందుకున్నాయి..ఇప్పటికే బీజేపీ బహిష్కృత నేత తోట కమలాకర్ రెడ్డి కారెక్కగా..తాజాగా కమలం పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన నాయకుడు రావుల శ్రీధర్‌ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది..గత కొంత కాలంగా రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న శ్రీధర్‌ రెడ్డి పార్టీ పదవులకు రాజీనామా చేశారు..గత పది సంవత్సరాలుగా వివిధ హోదాలో పదవులు చేపట్టిన శ్రీధర్‌ రెడ్డి.
2018లో జూబ్లీహీల్స్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు..రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై అసంతృప్తి చెందిన రావుల..బీజేపీ ప్రభుత్వంతో తెలంగాణకు న్యాయం జరగదని కుండబద్దలు కొట్టారు..కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్దిలో పురోగమిస్తుందన్నారు..ప్రతిసారి ఎన్నిక సమయంలో బీజేపీ ప్రజలను మభ్యపెడుతుందన్నారు..కేంద్ర ప్రభుత్వ విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు..బీజేపీ దేశంలో రైతు వ్యతిరేఖ విధానాలను అనుసరిస్తుందని విమర్శించారు..వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు శ్రీధర్‌ రెడ్డి..కేంద్రం ఏదయినా బిల్లు తెస్తే తెలంగాణకు అది లాభం అవుతుందా లేదా అనే ఒక చర్చ కూడా పార్టీలో జరగదని విమర్శించారు..కొత్త వ్యవసాయ చట్టాలు రైతులను ఇబ్బందులకు గురి చేసేవిగా ఉన్నాయన్నారు శ్రీధర్‌ రెడ్డి..రాష్ట్రంలో కేసీఆర్ పాలన రైతు పక్షంగా ఉందని అభినందించారు..కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు..కేసిఆర్ నాయకత్వం లో పని చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను అన్నారు శ్రీధర్‌ రెడ్డి..త్వరలోనే శ్రీధర్‌ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి..ఆయనతో పాటు పలువురు మరికొంత మంది కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news