విజయవాడలో ఓ హోటల్ లో తెలుగుదేశంలోని మాదిగ కులానికి చెందిన నేతల రహాస్య సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఏబీసీడీ వర్గీకరణ అంశంపై సుదీర్ఘ చర్చలు ఈ భేటీలో జరిపారని అంటున్నారు. వర్గీకరణ చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని మెజార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై తీర్మానం చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేయాలని నేతలు భావిస్తున్నారు. అవసరమైతే చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బృందం ఢిల్లీలో ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలసి వర్గీకరణ కోసం విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు వర్ల రామయ్య, కేఎస్ జవహర్, ఎంఎస్ రాజు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఇంకా సమావేశం కొనసాగుతోంది.