762 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి… పది మంది డకౌట్ అయ్యారు…!

-

క్రికెట్ లో సంచలనాలు జరగడం చూస్తూనే ఉంటాం. భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీంలు లక్ష్యం ముందు బోల్తా పడటం చూస్తూనే ఉంటాం… కనీసం పోరాట పటిమ లేకుండా ఎన్నో టీంలు విజయ లక్ష్యం ముందు చతికిలపడ్డాయి. ఒక టీంలో అయితే కనీసం… ఒక్క బ్యాట్సమెన్ అంటే ఒక్క బ్యాట్సమెన్ కూడా పరుగుల ఖాతా తెరవలేదు. టీం లో పది మంది డకౌట్ అయ్యారు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. హారిస్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా… చిల్డ్రన్ వెల్ ఫేర్ టీం… 762 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి కేవలం 7 పరుగులు మాత్రమే చేసింది.

అవి కూడా ఎక్సట్రా పరుగుల రూపంలో వచ్చినవే కావడం విశేషం. వివరాల్లోకి వెళితే బుధవారం ఆజాద్ మైదాన్ లోని న్యూ ఎరా క్రికెట్ క్లబ్ ప్లాట్ లో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన స్వామి వివేకానంద స్కూల్ టీం 39 ఓవర్లలో 4 వికెట్లకు 605 పరుగులు చేసింది, కాని చిల్డ్రన్స్ అకాడమీ టీం 45 ఓవర్లను సకాలంలో పూర్తి చేయనందుకు 156 పరుగులు జరిమానా విధించారు అంపైర్లు. 762 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చిల్డ్రన్స్ అకాడమీ టీం… కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అది కూడా అంధేరి నుండి వచ్చిన పాఠశాల కేవలం 6 ఓవర్లలో ఎక్స్ట్రా పరుగులు ఇవ్వడమే.

హారిస్ షీల్డ్ అండర్ -16 పాఠశాల మ్యాచ్ లో చిల్డ్రన్ అకాడమీ టీం బ్యాట్సమెన్ ఒకరు కూడా ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు. బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్ మీద కనీస పోరాటం చేయలేకపోయారు. టాప్ బ్యాట్సమెన్ గా పేరున్న వాళ్ళు కూడా ఈ మ్యాచ్ లో చేతులు ఎత్తేసారు. దీనితో 754 పరుగులతో భారీ విజయం సాధించింది స్వామి వివేకానంద స్కూల్ టీం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్స్ట్రా పరుగులు ఇచ్చినందుకు స్వామి వివేకానంద బౌలర్లకు ధన్యవాదాలు చెప్తున్నారు పలువురు.

Read more RELATED
Recommended to you

Latest news