దసరా మూవీ డిలీటెడ్ సీన్.. వెన్నెల ఆవేదన భరించలేనిది..!

-

కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా.. మహానటి కీర్తిసురేష్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం దసరా.. మార్చి 30న విడుదలైన ఈ సినిమా మంచి పాపులారిటీని దక్కించుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని చంకీల అంగీలేసి పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం విడుదలైన వెన్నెల మాస్ డాన్స్ వీడియో అయితే నెట్టింట షేక్ చేస్తోందనే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా వెన్నెల మాస్ డాన్స్ ఒక ఊపు ఊపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి డిలీట్ చేసిన ఒక సన్నివేశాన్ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు.

ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని వెన్నెల ఆవేదన చూపించారు.. అందులో ఏముంది అనే విషయానికొస్తే..”నిన్నే అంత కాని దాన్ని అయిపోయానా ఆడెవడో వచ్చి తాళి కడతా అంటే ఆపేది పోయి.. ఇంకా మీదకెళ్ళి తీస్కపో అని చెప్పి నన్ను వదిలించుకున్నాం. నువ్వసలు తల్లివేనా.?”.. అందరూ కూడా నా బతుకును ఎట్లా చేసిర్రో చూశినవా అని అత్త ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తుంది వెన్నెల. వెంటనే ఆమె అత్త వెన్నెలను తన అత్తారింటి ముందుకు తీసుకెళ్లి గిదే నీ ఇళ్లు, ఈడ్నే నీ బతుకు. నా మాట విని లోపలికి పోవే.. నీ భాంచేనే.. వన్ టూ వెన్నెలను బతిమలాడుకొని వెళ్ళిపోతుంది. కానీ అక్కడే ఏడుస్తూ నిలబడిపోతుంది వెన్నెల.

అయితే వీరి సంభాషణనంతా అక్కడే గోడ వెనుక ఉన్న ధరణి వింటుంటాడు” ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఇంత అద్భుతమైన సీన్ ఎందుకు డిలీట్ చేశారు అంటూ అభిమానులు తెగ ప్రశ్నిస్తున్నారు . మరి దీనిపై శ్రీకాంత్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news