రైతులకి గుడ్ న్యూస్.. కేంద్రం నుండి ఇంకో స్కీమ్..రూ.15 లక్షలు..!

-

రైతుల కోసం ఎన్నో రకాల స్కీములని ప్రభుత్వం తీసుకు వచ్చింది. రైతుల కి ఇచ్చే స్కీమ్స్ లో కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఇప్పటి వరకైతే 13వ విడత వరకు డబ్బులు జమ అయ్యాయి. ఇక ఇప్పుడు 14వ విడత డబ్బుల కోసం చూడాలి. రైతులు అందరు కూడా 14వ విడత సొమ్ము ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.

farmers

కేంద్రం తీసుకు వచ్చిన స్కీముల్లో ‘PM కిసాన్ FPO యోజన’ కూడా ఒకటి. ఇది కూడా రైతుల కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు స్వావలంబన సాధించడమే ఈ స్కీమ్ లక్ష్యం. ఈ పథకం కింద ప్రభుత్వం వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు రైతులను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం రైతులకు 15 లక్షల రూపాయలను ఈ స్కీమ్ కింద ఇస్తోంది. వ్యవసాయ వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం రైతులకు 15 లక్షల రూపాయల దాకా ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ఇస్తోంది.

పిఎం కిసాన్ ఎఫ్‌పిఓ యోజన స్కీమ్ కింద ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు మోదీ ప్రభుత్వం రూ.15 లక్షలు ఇస్తుంది. ఈ స్కీమ్ డబ్బులని పొందాలంటే 11 మంది రైతులు కలిసి ఒక కంపెనీని ఏర్పాటు చేయాలి. ఆ తరవాత ఈ స్కీము కింద రైతులకు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, ఎరువులు, విత్తనాలు మొదలైనవి కొనుగోలు చేయడం ఈజీ అవుతుంది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీరు ఈ ప్రక్రియ ని పూర్తి చేసుకోవచ్చు.

నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసాక.. హోమ్ పేజీలో ఇచ్చిన FPO మీద క్లిక్ చేయండి.
ఆ తరవాత రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన మొత్తం సమాచారాన్ని ఇచ్చేసి… పాస్‌బుక్ లేదా రద్దు చేయబడిన చెక్కును అప్‌లోడ్ చేయండి.
ఫారం పూర్తి చేసేసి.. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
దీని తర్వాత హోమ్ పేజీలో ఇచ్చిన FPO ఎంపికపై క్లిక్ చేయండి.
లాగిన్ ఫారమ్ ఓపెన్ చేసి పేరు పాస్‌వర్డ్ మరియు క్యాప్చా కోడ్‌ను మీరు ఎంటర్ చేయండి. దీనితో మీరు లాగిన్ అవుతారు. ఇలా లాగిన్ చేసేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news