ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన చంద్రబాబుకు చెప్పుతో కొట్టండి : ద్వారంపూడి

-

ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన చంద్రబాబుకు చెప్పుతో కొట్టండని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను పప్పు అని పిలివడం నాకు నచ్చలేదు లేదని.. ఎమ్మెల్యే గా కూడా గెలవలేని లోకేష్ ను డ్యాష్ అనే అంటానన్నారు. ఆ డ్యాష్ లో నేను జీరో అని పెట్టుకుంటాను.టిడిపి వాళ్ళు హీరో అని పెట్టుకోండని పేర్కొన్నారు.

నందమూరి కుటుంబాన్ని చంద్రశేఖర్ రెడ్డి ఏదో అనేశాడని టిడిపి నేతలు తెగ భాధ పడిపోతున్నారని.. చంద్రబాబు లాంటి బావ మా ఇంట్లో ఉండి..నా తండ్రి ని మోసం చేస్తే నేను ఊరుకోనన్నారు. మరీ నందమూరి కుటుంబ సభ్యులు ఎందుకు ఊరుకున్నారో నాకైతే తెలియదని చురకలు అంటించారు. నందమూరు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచి మోసం చేసింది చంద్రబాబు నాయుడు అని.. తండ్రిని చంపిన వ్యక్తి వెనుక నందమూరి కుటుంబం అంతా ఉంటుందన్నారు.

నందమూరు కుటుంబంపై టిడిపి నేతలకు అభిమానం ఉంటే ముందు చంద్రబాబు నాయున్ని చెప్పుతో కొట్టండి… 2017 లో కాకినాడ పోర్టు నుండి హెరిటెజ్ సంస్ధ బియ్యం ఎగుమతి చేయ్యలేదా ? అని ఫైర్ అయ్యారు. ఇక్కడ రేషన్ బియ్యం ఎగుమతి కావడానికి ఆస్కారం లేదని హెరిటేజ్ బియ్యం ఎగుమతి మానుకుందని చెప్పారు. చంద్రబాబు దగ్గర జీతం తీసుకుని పట్టాభి కాకినాడ పోర్టు మీద పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని అగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version