తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబై చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు నటుడు ప్రకాష్ రాజ్ సీఎం కేసీఆర్ కు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. లంచ్ మీటింగ్ లో ఉద్దవ్ ఠాక్రేతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. తాజాగా ఉద్ధవ్ ఠాక్రేతో సీఎ కేసీఆర్ భేటీ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.
సీఎంతో పాటు ఎంపీలు కేశవరావు, రంజిత్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రావు, కవితలు పాల్గొనగా.. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు శివసేన ముఖ్యనేత ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఉద్దవ్ ఠాక్రేతో మీటింగ్ తరువాత ఎన్సీపీ నేత శరద్ పవార్ తో మీటింగ్ కానున్నారు.