15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కోసం ఆన్‌లైన్ ఆడిట్ తప్పని సరి అని కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలు వినియోగించిన నిధులపై ఆన్‌లైన్ ఆడిట్ జరగనుంది. తొలి విడతలో భాగంగా సోమవారం నుంచి ప్రారంభమై అక్టోబరు చివరి వారం వరకూ ఈ ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణలోని 12,769 పంచాయతీలకు గాను 3,830 పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 336 మంది ఆడిటర్లను నియమించారు. కాగా, ఇంతవరకు గత ఏప్రిల్,మే,జూన్‌కు సంబంధించి గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు అందాయి.
ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. ఇందులో 5శాతం జడ్పీకి, 10శాతం మండల పరిషత్‌లకు ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం నిధులు ఏకంగా గ్రామ పంచాయతీలకు 85శాతం,మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్ 5 శాతం నిధులు కేటాయింపులు చేయడం జరిగింది.