తెలంగాణా ఎంసెట్ ఫలితాల్లో తీవ్ర గందరగోళం.. కన్వీనర్ క్లారిటీ ఇదే !

-

ఎంసెట్ ర్యాంక్ ల విషయంలో జరుగుతున్న గందరగోళ ప్రచారం మీద కొద్దిసేపటి క్రితం ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ వివరణ ఇచ్చారు. అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పాస్ అయిన వారి ర్యాంక్ లు రెగ్యులర్ ర్యాంక్ లతో పాటు ప్రకటించడం లేదని, వారికి తర్వాత ప్రకటించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందన్న ఆయన సప్లీలో పాస్ ఆయిన వారి ర్యాంక్ లు రేపు ప్రకటిస్తామని అన్నారు. అలానే ఇంటర్ హాల్ టికెట్ నంబర్ సరిగా ఎంటర్ చేయక పోవడంతో ఎంసెట్ లో మార్క్ లు వచ్చిన వారి ర్యాంక్ లు ప్రకటించ లేదని అన్నారు.

హాల్ టికెట్ నంబర్ సరి చేసిన తర్వాత వారి ర్యాంక్ లు ఇస్తామని ఆయన అన్నారు. అలానే వారు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ లో పాల్గొనవచ్చని అన్నారు. అయితే ఎంసెట్ పరీక్షలో క్వాలిఫై అయిన ఇంటర్ లో పాస్ కాక పోతే వారికి రాంక్స్ ఇవ్వబడవని అన్నారు. ఇంటర్ హాల్ టికెట్ నంబర్ ఎంసెట్ దరఖాస్తు ఫారంలో సుమారుగా రెండు వేల మంది విద్యార్థులు తప్పుగా ఎంటర్ చేశారని ఆయన పేర్కొన్నారు. హాల్ టికెట్ తప్పుగా నమోదు చేసుకున్న విద్యార్థులకు కరెక్షన్ చేసుకోవడానికి ఎంసెట్ అధికారులు లింక్ పంపించారని అన్నారు. విద్యార్థులు ..తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news