ఈశాన్య రాష్ట్రాల్లో వరసగా భూకంపాలు… అరుణాచల్, మణిపూర్ లలో భూకంపం

-

ఈశాన్య రాష్ట్రాల్లో వరసగా భూకంపాలు సంభవించాయి. ఈరోజు ఉదయం అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో వరసగా భూకంపాలు సంభవించాయి. అరుణా చల్ ప్రదేశ్లోని బాసర్ కు ఉత్తర వాయువ్య దిశలో 148 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీక్రుతం అయి ఉంది. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. 

ఇదిలా ఉంటే మణిపూర్ లో కూడా భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌లో ఉదయం 7:52 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మిజోరాంలోని న్‌గోపాకు తూర్పు-ఈశాన్యంగా 46కిమీ దూరంలో భూకంప కేంద్ర ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వరసగా భూకంపాలు నమోదవుతున్నాయి. రెండు రోజుల క్రితం కాశ్మీర్ లో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు వచ్చాయి. అయితే తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news