ఇటీవల కాలంలో ఇండియాలో తరుచుగా భూకంపాాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా హిమాలయ పర్వత రీజియన్ తోపాటు అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో భూకంపాలు వస్తున్నాయి. దీంతో పాటు మణిపూర్, అస్సాం రాష్ట్రాల్లో ఇటీవల భూకంపాలు సంభవించాయి. అయితే ఇవన్నీ తక్కువ తీవ్రత కలిగినవే కావడంతో పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టాలు కలగలేదు. కేవలం రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5 లోపే ఉంటుండటంతో పెద్దగా నష్టం కలగలేదు.
తాజాగా నేడు రాజస్థాన్ లో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి రాజస్థాన్ జాలౌర్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శనివారం అర్ధరాత్రి 2.26 గంటల సమయంలో.. భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైంది. జోధ్పుర్కు 150 కిలోమీటర్లు దూరంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.