ఏడ్చే మగవాణ్ణి అస్సలు నమ్మొద్దు : చంద్రబాబుపై వర్మ సెటైర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న మీడియా ముందు బోరున ఏడ్చేసిన సంగతి తెలిసిందే. వైసిపి పార్టీ నాయకులు… తన కుటుంబంపై చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేస్తూ బోరున విలపించాడు చంద్రబాబు. అయితే… దీని పై.. మరోసారి టాలీవుడ్‌ వివాదస్పద దర్శకుడు… రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన ట్వీట్‌ చేశాడు.

Ram Gopal Varma
Ram Gopal Varma

ఏడ్చే మగాళ్లను నమ్మకూడదంటూ ట్వీట్‌ చేశాడు రామ్‌ గోపాల్‌ వర్మ. ”ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఎవరో పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను..కానీ నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను, ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి , కానీ బలం మరియు ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుంది ” అంటూ సంచలన ట్వీట్ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. అలాగే.. వైసీపీ ఎమ్మెల్యే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలను కూడా షేర్‌ చేశాడు రామ్‌ గోపాల్‌ వర్మ.