BREAKING : తజికిస్థాన్​లో భారీ భూకంపం

-

మొన్నటిదాకా టర్కీ, సిరియాలను వణికించిన భూకంపం ఇప్పుడు తజికిస్థాన్​లో ప్రకంపనలు సృష్టించింది. సెంట్రల్‌ ఆసియా దేశమైన తజికిస్థాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. ఇవాళ తెల్లవారుజామున 5:37 గంటల సమయంలో అక్కడ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

గోర్నో-బదక్షన్ ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌జీఎస్‌ పేర్కొంది. ఆ తర్వాత 20 నిమిషాలకు 5.0 తీవ్రతతో అదే ప్రాంతంలో మరో భూకంపం సంభవించినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపిచడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

గాఢ నిద్రలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంగాక నిద్రలోనే ఇళ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు బుధవారం రోజున ఇండియాలోనూ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news