Amazon Plus Shop Sale:అమెజాన్ లో సగం ధరకే బ్రాండెడ్ దుస్తులు.. ఓ లుక్ వేసేసుకోండి..

-

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ను చెప్పింది.. మరోసారి భారీ సేల్ తో ముందుకు వచ్చింది.ఈ సేల్ ఫ్యాషన్ కేటగిరీకి చెందినది. సేల్ పేరు ‘ప్లస్ షాప్’..ఈ సేల్ ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభించింది అమెజాన్. ఈ సేల్ చివరి రోజు ఫిబ్రవరి 26. ప్లస్ సైజ్ కస్టమర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సేల్ ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో ప్రముఖ బ్రాండ్‌ల దుస్తులను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే, కస్టమర్లు తమ అవసరాలకు అనుగుణంగా 2XL నుండి 8XL వరకు ఫ్యాషన్ దుస్తులను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. ‘ది ప్లస్ షాప్’లో 450 బ్రాండ్ల నుండి 6 లక్షలకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నట్లు అమెజాన్ ప్రకటించింది..

Biba, BigBanana, Plus, Allen Solly, NYKD మరియు U.S. పోలో అసోసియేషన్ సహా 450 బ్రాండ్ల దుస్తులను సేల్ లో సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ఫ్యాషన్‌లో 50% తగ్గింపుతో దుస్తులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంకా మీరు IDBI బ్యాంక్‌ కార్డుతో షాపింగ్ చేస్తే అదనంగా 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. మరోవైపు, మీరు అమెజాన్‌లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో మీరు షాపింగ్ చేస్తే మీకు 5 శాతం తగ్గింపును పొందవచ్చు..

ఇవే కాదు ఫ్యాషన్ కు సంబంధించి మరికొన్ని వస్తువుల పై భారీ తగ్గింపు కూడా ఉందని అమెజాన్ పేర్కొన్నారు..ఈ అమెజాన్ విభాగంలో మేకప్‌పై 30%, చర్మ సంరక్షణపై 30%, హెయిర్‌కేర్‌పై 30% మరియు లగ్జరీ వస్తువులపై 30% తగ్గింపును అందిస్తోంది. పిల్లల దుస్తులపై 60% వరకు తగ్గింపును అందుకోవచ్చు. చూసారుగా ఎన్ని ప్రోడక్ట్ లపై ఎన్ని ఆఫర్లు ఉన్నాయో మీరు కూడా త్వరపడండి..

Read more RELATED
Recommended to you

Latest news