మన హైదరాబాద్ లో ఎవ్వరైనా బ్రతకడానికి వీలుంటుంది. అందరికీ కావాల్సిన సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అయినా కానీ కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ లివింగ్ నగరాల్లో మొదటి పది స్థానాల్లో హైదరాబాద్ లేకపోవడం ఒకింత ఆశ్చర్యంగా ఉంది. నగరాల్లో జీవనం సాగించేందుకు ఉండే సదుపాయాలు, పరిస్థితుల ఆధారంగా ర్యాంక్ ఇచ్చిన కేంద్రం, మొదటి స్థానంలో బెంగళూరును ఉంచింది.
10లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకి ఇచ్చిన ర్యాంకింగ్ లో బెంగళూరు టాప్ లో ఉండగా తర్వాతి రెండు మూడు స్థానాల్లో పుణె, అహమ్మదాబాద్ నిలిచాయి. చెన్నై నాలుగవ స్థానంలో నిలవగా, విశాఖపట్నం 15వ స్థానంలో, హైదరాబాద్ 24వ స్థానంలో నిలిచింది. 10లక్షల కంటే తక్కువ జనాభా కలిగిన నగరాల్లో ఈజ్ ఆఫ్ లివింగ్ నగరంగా టాప్ లో సిమ్లా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది.