ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాజముద్ర…

-

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈబీసీల 10శాతం రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు.దీంతో ఈ బిల్లుపై గెజిట్‌ విడుదలైంది. అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో ఈ బిల్లుకు ఇటీవల లోక్‌సభ, రాజ్యసభ 2/3వంతు మెజార్టీతో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన విషయం తెలిసిందే. దీంతో శనివారం సాయంత్రం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు మార్గం సుగమమైంది.

రిజర్వేషన్లతో ఎవరి లబ్ధి… వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా వార్షికాదాయం రూ.8 లక్షల కన్నా తక్కువ ఉన్నవారు…, అయిదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1,000 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణం ఉన్న ఇల్లు కలిగి ఉన్నవారికి, నాన్‌-నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతంలో 200 గజాలకన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు,  నోటిఫైడ్‌ మున్సిపల్‌ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ స్థలంలో ఇల్లు ఉన్నవారు.. రిజర్వేషన్‌ పొందేందుకు అర్హులు.

Read more RELATED
Recommended to you

Latest news