కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై అనుసరిస్తున్న విధానాలపై తెరాస అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం పర్యటన, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూపకల్పన నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ….స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుసున్నప్పటికీ ప్రజల అవసరాలను తీర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని తెలిపారు. కేంద్రంలోని ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు.. నాటి నుంచి కాంగ్రెస్, భాజపా అనే రెండు రాజకీయ వ్యవస్థలే దీనికి మూల కారణమని సీఎం మండిపడ్డారు. ‘‘దేశానికి విశాలమైన ఆర్థిక విధానం ఉంది. కానీ, అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉన్నాయి. వీటిన్నింటిని గమనించే… పురోగతి సాధిస్తున్న రాష్ట్రాల విధానాల్లో జోక్యం చేసుకోవద్దని నేను నీతిఆయోగ్ సమావేశాల్లో గతంలో స్పష్టం చేసినట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అంచనా వేసే ఆర్థిక సంఘం సైతం సరైన విధానాన్ని అనుసరించడం లేదన్నారు. స్పష్టమైన అవగాహనకు వచ్చాకే బడ్జెట్ రూపకల్పన జరగాలి. మన బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవాలని అధికారులను వివరించారు.