ఏపీలో రాష్ట్ర పార్టీగా BRS గుర్తింపు రద్దు చేసిన ఈసీ

-

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరించింది. కేవలం తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా గుర్తిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, ఎన్సీపీ పార్టీలకు జాతీయ పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి శుభవార్త చెప్పింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)కి జాతీయ పార్టీ హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ మొదట ఢిల్లీలో మాత్రమే పోటీ చేస్తూ తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news