ఈనాడు రామోజీరావు..తెలుగు ప్రజల ఆస్తి – వైసీపీ ఎంపీ

-

ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకులు, ఫిలిం సిటీ సృష్టికర్త రామోజీరావు గారు అనే వ్యక్తి కేవలం తన కుటుంబ సభ్యుల ఆస్తి మాత్రమే కాదని, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు మాదిరిగా ఫిలిం సిటీ నిర్మాణాన్ని రామోజీరావు గారు చేశారని కొనియాడారు.

మార్గదర్శి సంస్థను 1962లో రామోజీరావు స్థాపించారని, దినదినాభివృద్ధి చెందుతూ, గత 60 ఏళ్లలో 108 శాఖలకు విస్తరించి 3000 మంది ఉద్యోగులు, మూడు లక్షల మంది ఖాతాదారులతో, ఏడు వేల కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్ కలిగి సజావుగా సాగుతున్న సంస్థ మార్గదర్శి అని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన ఫ్యాక్షన్ మనస్తత్వంతో, కక్ష సాధింపు ధోరణిలో భాగంగా, ఒక్క రోజైనా రామోజీరావు గారిని, మార్గదర్శి సంస్థ ఎండి శైలజ గారిని జైలులో పెట్టాలనే దురుద్దేశంతో మార్గదర్శిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర సీఐడీ పోలీసులను ఆదేశించారని తెలిపారు.

మార్గదర్శి సంస్థ నిర్వాహకులకు ఒక చిట్టి నిర్వహిస్తే కేవలం 5% మాత్రమే ఆదాయం లభిస్తుందని, ఆ ఆదాయం ద్వారానే ఉద్యోగులకు జీతభత్యాలతో పాటు, ఆఫీసు నిర్వహణ ఖర్చును భరించాల్సి ఉంటుందని అన్నారు. చిట్ ఫండ్ చట్టం ప్రకారం చిట్టి నిర్వాహకులు కూడా ఆ చిట్టిలో సభ్యుడై ఉండాలని, రెండవ నెలలోనే చిట్టి నిర్వహకుడైన సభ్యుడు చిట్టిని పాడుకునే వెసులుబాటు చట్టం కల్పించిందని, తాను తీసుకున్న చిట్టి మొత్తాన్ని మిగతా సభ్యుల మాదిరిగానే వాయిదాలలో నిర్వాహకుడు కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news