ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి దూకుడు పెంచింది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులకు ఈడి నోటీసులు జారీ చేసింది. అలాగే ఈడి ఛార్జిషీటులో అరవింద్ కేజ్రీవాల్ పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. నిందితులకు, కేజ్రీవాల్ కు మధ్య విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు అభియోగాలు మోపింది దర్యాప్తు సంస్థ. మద్యం కుభంకోణం భాగస్వాములైన వారితో కేజ్రీవాల్ ఫేస్ టైమ్ లో మాట్లాడినట్లు చార్జిషీటులో పేర్కొంది ఈడి.
సౌత్ గ్రూపు నుండి వచ్చిన 100 కోట్ల ముడుపులు ఆప్ కు అందాయని ఇప్పటికే అభియోగాలు మోపింది ఈడి. అలాగే ఈ కేసులో ఆయన పిఏ బిభవ్ కుమార్ ను ఈడి అధికారులు ప్రశ్నించారు. కేసు విచారణలో భాగంగా అతడి నుంచి కొంత సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన అధికారులు ఇప్పుడు ఏకంగా సీఎం కేజ్రీవాల్ పీఏను ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది.