ఈ స్కీమ్ ఇన్వెస్ట్ చేస్తే రూ.63 లక్షల రిటర్న్స్ పొందవచ్చు..ఇలా ప్లాన్ చేసుకోండి..

-

ఆడపిల్లలు పుడితే ఖర్చులు భయం ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది..అందుకే చిన్నప్పుడు నుంచే వారి కోసం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.ఆడపిల్లల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి సుకన్య సమృద్ధి పథకాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది.తల్లిదండ్రులు తమ కూతురు పేరుపై ప్రతీ నెలా కొంత పొదుపు చేయొచ్చు. ఏడాదికి కనీసం రూ.250 చొప్పున పొదుపు చేయొచ్చు. గరిష్టంగా ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 చొప్పున పొదుపు చేయొచ్చు. ఈ పథకంలో 15 ఏళ్లు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఆడపిల్లలకు 21 ఏళ్లు పూర్తైన తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయి. అయితే ఈ పథకంలో ఎంత పొదుపు చేస్తే ఎంత రిటర్న్స్ ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం..

సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది. ఈ వడ్డీ రేటును ప్రతీ మూడు నెలలకు ఓసారి సవరిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. వడ్డీ పెరగొచ్చు, తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర పథకాలతో పోలిస్తే అత్యధిక వడ్డీ వస్తున్న చిన్నమొత్తాల సేవింగ్ స్కీమ్ ఇదే..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపు లభిస్తుంది. జమ చేసిన డబ్బులకు మాత్రమే కాదు, వాటిపై వచ్చిన వడ్డీ కలిపి, మెచ్యూరిటీ సమయంలో వచ్చే మొత్తానికి కూడా ఈ మినహాయింపు లభిస్తుంది. ఈ పథకంలో ఎంత ఎక్కువ పొదుపు చేస్తే అంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయి..దాని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ పథకంలో ప్రతీ ఏటా రూ.10,000 చొప్పున జమ చేస్తే 15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.1,50,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.2,74,344 వడ్డీ కలిపి మొత్తం రూ.4,24,344 రిటర్న్స్ వస్తాయి..అదే రూ.20 వేలు ఇన్వెస్ట్ చేస్తే..15 ఏళ్లలో జమ చేసే మొత్తం రూ.3,00,000 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.5,48,687 వడ్డీ కలిపి మొత్తం రూ.8,48,687 రిటర్న్స్ వస్తాయి.. ఇలా మీరు పెట్టే పొదుపును బట్టి మీకు అమౌంట్ అనేది పెరుగుతూ వస్తుంది.. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే పథకంలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news