హీరో సచిన్ జోషికి బిగ్ షాక్.. రూ 400 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పలు సినిమాల్లో హీరోగా నటించిన వ్యాపారవేత్త సచిన్ జోషి కి ఊహించని షాక్ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త సచిన్ జోషి ఇ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) జప్తు చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం అందుతోంది.

నటుడు సచిన్ జోషి కి చెందిన 400 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు ఏకంగా మూడు వందల ముప్పై కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన 80 కోట్ల ఆస్తులు సచిన్ జోషి కి చెందిన వైకింగ్ గ్రూపు కంపెనీలకు చెందిన అని స్పష్టం చేసింది. ఎస్ ఆర్ ఏ ప్రాజెక్టు లో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడింది అన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ సచిన్ జోషి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే ట్ జప్తు చేసింది. కాగా ఇంతకు ముందు నటుడు సచిన్ జోషి ఆస్తులపై ఈడీ దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే.