ఎల్లుండి నుంచి తెలంగాణలో మళ్లీ ఆన్లైన్ క్లాసులు !

-

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా మహమ్మారి కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మొదట్లో 1000 లోపు నమోదైన కరోనా కేసులు ఇప్పుడు ఇరవై ఐదు వందలకు పైగా నమోదవుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ పేరుతో జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు హాలిడేస్ ప్రకటించింది కెసిఆర్ సర్కార్.

అయితే కరోనా కేసుల తీవ్రత తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే స్కూల్ హాలిడేస్ పెంచాలని ఇప్పటికే కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాధికారులు… ప్రభుత్వానికి మార్గదర్శకాలను అందించినట్లు తెలుస్తోంది. ఇక రేపు దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా గత ఏడాది నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్లైన్ క్లాసులు కారణంగా విద్యార్థులు చాలా నష్టపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news