పూరి జగన్నాథ్, ఛార్మిని 13 గంటల పాటు విచారించిన ఈడీ…

-

Entertainment విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ చిత్రం పరాజయం పాలైనప్పటికీ ఆ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు మాత్రం ఆగటం లేదు.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిర్మాణం విషయంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్ర నిర్మాతలుగా ఛార్మి, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మాత్రమే వ్యవహరించినట్టు బయటకు చెబుతున్నా.. దీని వెనుక చాలామంది ఉన్నారని… విదేశీ పెట్టుబడులు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాధ్, నిర్మాత ఛార్మిను ఈడి విచారించింది.. దాదాపు 13 గంటల పాటు సాగిన ఈ విచారణ లో పలు ఆసక్తికర విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది..

లైగర్ సినిమా ఆర్థిక లావాదేవీలపై పూరి జగన్నాథ్, ఛార్మిలను ఈడి దాదాపు 13 గంటల పాటు విచారించింది. లైగర్ సినిమాలో విదేశీ పెట్టుబడులు పెట్టారనే కోణంలో విచారణ జరిపించిన ఈడి.. స్థానిక పెట్టుబడుల పైన కూడా ఆరా తీసింది.. అయితే కొందరు తమ బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చుకునేందుకు హవాలా, మనీ ల్యాండరింగ్ రూపంలో పెట్టుబడులు పెట్టారని ఈడీ అనుమానిస్తుంది. అంతేకాకుండా వీరిద్దరి ఖాతాలో అధిక మొత్తంలో విదేశీ డబ్బు జమ అయినట్టు కూడా తెలుస్తోంది

అయితే ఈ సినిమాపై ముందు నుంచి కూడా వివాదాలు నెలకొంటూనే ఉన్నాయి. ఈ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబాడులు పెట్టారని.. తన దగ్గర ఉన్న అక్రమ సొమ్మును వైట్ మనీగా మార్చేందుకుకే ఈ ప్రయత్నాలు అంటూ కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. అంతేకాకుండా ఈ విషయంపై తమ దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈడిని కోరారు.. అయితే ప్రస్తుతం ఈ విచారణలో ఏమి తేలింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news