యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉండటం ఎంత కామన్ అయిపోయిందో…మధుమేహం అనేది కూడా అంతే తయారైంది.. ముప్పై వస్తున్నాయంటే చాలు.. షుగర్ యటాక్ అవుతుంది. ఇంకా..షుగర్ అనేది కేవలం పెద్ద వయసు వారికి మాత్రమే వచ్చే వ్యాధి అనడానికి లేకుండా పోయింది. చిన్నపిల్లలకు కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు.. డయాబెటిస్ వ్యాధిపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. అది ఏయే కారణాల వల్ల వస్తుంది? కేవలం తీపి, పిండి పదార్థాలు తినడం వల్లేనా? లేదా ఇంకా మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే అంశాలపై అనేక పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ పరిశోధన చూస్తే షాక్ అవ్వాల్సిందే. వీదుల్లో ఉండే లైటింగ్ వల్ల కూడా డయబెటీస్ వచ్చే ప్రమాదం ఉందట..!!
ప్రాంక్రియాస్ పనితీరు సరిగా లేనపుడు డయాబెటిస్ సమస్య శరీరంలో మొదలవుతుంది. డయాబెటిస్ మొదలైన తర్వాత రక్తంలో గ్లూకోజ్.. అవసరమైన దాని కంటే ఎక్కువ, లేదా తక్కువ ఉంటుంది. స్థిరంగా కొనసాగదు. వీధుల్లోని ఆర్టిఫిషియల్ లైట్ (Light At Night-LAN) కూడా శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తుందని చైనాకు చెందిన పరిశోధకులు అంటున్నారు. దాదాపుగా 9 మిలియన్ కేసుల్లో లాన్ వల్ల గ్లూకోజ్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు కనిపించాయట. చైనాలోని నాన్ కమ్యూనల్ డిసీస్ సర్వేయలెన్స్ స్టడీస్ వారి నుంచి సెకరించిన డేటాను వైద్య నిపుణులు పరిగణనలోకి తీసుకున్నారట. 98,658 మందిని అధ్యయనానికి ఎంచుకుని.. వారిలో LANతో పాటు బీఎంఐ వంటి ఇతర కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని పరిశోధించారు.
హైయ్యర్ లాన్ ఏరియాల్లో ఉండే వారిలో డయాబెటిస్ 28 శాతం ఎక్కువగా ఉన్నట్టు నిపుణులు అంటున్నారు. హైయ్యర్ లాన్ ఏరియాల్లో నివసించే వారిలో అత్యధికంగా.. ప్రతి 42 మందిలో ఒక డయాబెటిస్ రోగి ఉన్నట్టు తెలుసుకున్నారు. దీన్ని బట్టి UK జనాభాలో దాదాపు 83 శాతం, USAలో 99 శాతం ప్రజలు ‘లైట్ పొల్యూటెడ్ స్కై’ కిందే నివసిస్తున్నారని, వీరంతా కూడా రిస్క్ లో ఉన్నట్టే.
హైయ్యెస్ట్ ఆర్టిఫిషియల్ అవుట్ డోర్ లైట్ లెవెల్స్ అర్బన్ ఏరియాల్లో, పెద్ద సిటీల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే అర్బన్ ఏరియాల్లో కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవడం, సెడంటరీ లైఫ్ స్టయిల్, సోషల్ యాక్టివిటి తక్కువగా ఉండడం ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉండడం వల్ల ఒబెసిటి రిస్క్ ఎక్కువ. ఒబెసిటి టైప్ 2 డయాబెటిస్‌కి కారణం అవుతుంది.
మెలటనోనిన్ తగ్గినపుడు డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది. లైట్ వెలుతురు మెలటనోనిన్ లెవెల్స్ మీద నేరుగా ప్రభావం చూపిస్తుంది. ఆర్టిఫిషియల్ లైట్ ఎక్స్ పోజర్ వల్ల ఇన్సులిన్ ప్రక్రియ మీద ప్రభావం చూపుతుందని..ఇది కొనసాగితే గ్లూకోజ్ ఇన్ టాలరెన్స్ వస్తుందని నెదర్లాండ్స్ ఇనిస్ట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.!