ఈడీ చరిత్రలో భారీ జరిమానా… ఏకంగా రూ.222.44 కోట్లు..

-

ప్రముఖ వ్యాపారి సుఖేష్‌ గుప్తాకు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. ఆయన మీద నమోదయిన ఈడీ కేసులో సుఖేష్ గుప్తాకు చుక్కెదురు అయింది. దీంతో ఇండియన్ ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ చరిత్రలో భారీ జరిమానా వేసింది. ఏకంగా సుఖేష్ గుప్తాకు చెందిన ఎంబీఎస్‌ జ్యువెలర్స్‌కు రూ.222.44 కోట్ల జరిమానా విధించింది. ఇక వ్యక్తిగతంగా సుఖేష్ గుప్తకు 22 కోట్ల రూపాయల ఫైన్ విధించింది.

ఫెమా కేసులో ఈ భారీ జరిమానా విధించింది ఈడి, హాంకాంగ్‌ కు డైమండ్‌ ఎక్స్‌ పోర్ట్‌ చేసిన విషయం మీద ఫెమా కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీతో ట్రాన్సాక్షన్‌ చేసినందుకు గాను ఈ భారీ జరిమానా వేసినట్టు చెబుతున్నారు. హాం కాంగ్‌ కు చెందిన లింక్‌ ఫై కంపెనీకి ఇక్కడి నుండి డైమండ్ల సరఫరా చేసినట్టు గుర్తించారు. గతంలో ఎంబియస్ జ్యువెల్లరీస్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కూడా వాటాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కోణంలోనే సిబిఐ దర్యాప్తు కూడా చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news