టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఈడీ విచారణ ప్రారంభం.. నేటి నుండే

నాలుగేళ్ళ క్రితం తెలుగు సినిమా రంగాన్ని కుదిపేసిన మాదక ద్రవ్యాల కేసు మళ్ళీ బయటకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఈడీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అందుకే విచారణ ప్రారంభించనుంది. నేటి నుండి మొదలయ్యే విచారణ సెప్టెంబరు 22 వ తేదీవరకు కొనసాగనుంది. విడతల వారీగా ఒక్కొక్కరికీ నోటీసులు పంపించి విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే 12మందికి నోటీసులు పంపారని సమాచారం. మొత్తం ఎక్సైజ్ శాఖ విచారించిన 50మందికి నోటీసులు పంపే అవకాశం ఉంది.

అదీగాక మరో 12మందితో కలుపుకుని 62మందిని విచారించేందుకు ఈడీ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. మనీలాండరింగ్ కేసులో లబ్దిపొందిన వారి నుండి అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ అడుగులు వేస్తుంది. మానీ లాండరింగ్ సెక్షన్ 3,4 కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ రోజు టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఈడీ ముందుకు హాజరు కానున్నారు.