బండిసంజయ్ నాలుగో రోజు పాదయాత్ర.. హిమాయత్ నగర్ నుండి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. మూడురోజుల క్రితం మొదలైన పాదయాత్ర ఈరోజు కూడా కొనసాగనుంది. నాలుగో రోజు హిమాయత్ నగర్ గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 10గంటలకు మొదలు కానున్న ఈ ప్రజా సంగ్రామ పాదయాత్ర కనకమామిడి వరకు, దాదాపు 10కిలోమీటర్లు కొనసాగుతుంది. ఈ పాదయాత్ర పర్వంలో తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బండి సంజయ్.

టీఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం తో పొత్తుపై వ్యాఖ్యలు చేసారు. తాము అధికారంలోకి వస్తే ఎంఐఎం పార్టీని పాకిస్తాన్ పంపివేస్తామని, అలాగే నిజాం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చేస్తామని అన్నారు. ఇటు బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు కౌంటర్లు వేస్తున్నారు. పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని ఆల్రెడీ కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికలొస్తే చాలు పాకిస్తాన్ గుర్తొస్తుందని, ఇవన్నీ మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికే అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడారు.