సామాన్యుడికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. గ్యాస్, వంట నూనెలు ఇలా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. తాజాగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఇండోనేషియా కారణంగా వంటనూనెల ధరలు పెరగనున్నాయి. పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించింది.
ఈనెల 28వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఇండియా 70 శాతం పామాయిల్ ఇండోనేషియా నుంచి, 30% మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక ఇండోనేషియా తాజాగా తీసుకున్న నిర్ణయంతో… ఇండియాలో విపరీతంగా వంటనూనెల ధరలు పెరగనున్నాయి.
ఇండోనేషియా నిర్ణయం వల్ల ధరలు మరింత పెరగవచ్చని సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు జటిలంగా మారవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇండోనేషియా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు.