ఎడిట్ నోట్: ప్లీనరీ సక్సెస్..కానీ!

-

తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు మిన్నగా వైసీపీ ప్లీనరీ సమావేశాలని నిర్వహించాలని అనుకుంది…పైగా అధికారంలో ఉండటంతో ఏ మాత్రం మహానాడు కంటే తగ్గిన రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి…అవన్నీ దృష్టిలో పెట్టుకుని అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలని విజయవంతం చేసుకుంది. ప్లీనరీ మొదటి రోజు జనం బాగానే వచ్చిన…రెండో రోజు మాత్రం ప్రవాహంలా వచ్చారు..వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు…అధికారంలో ఉండటంతో ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల నుంచి బస్సులు పెట్టి మరీ ప్లీనరీ సమావేశాలకు జనాలని తీసుకొచ్చారు.

రెండోరోజు దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు వచ్చి ఉంటారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా మహానాడుని మించేలా ప్లీనరీ సమావేశాలని వైసీపీ సక్సెస్ చేసుకుంది. అలాగే ప్లీనరీ వేదికగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. చంద్రబాబుని తిట్టిన ప్రతిసారి వైసీపీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది..ముఖ్యంగా కొడాలి నాని మాట్లాడినప్పుడు భారీ స్పందన వచ్చింది. ఇక జగన్ మాట్లాడుతున్నంత సేపు…కార్యకర్తలు సందడి చేస్తూనే ఉన్నారు. అలాగే వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి లోటు లేకుండా మంచి పసందైన భోజనాలని పెట్టారు. మొత్తానికైతే ప్లీనరీ సమావేశాలు సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు.

అయితే అంతా బాగానే ఉంది గాని…జగన్ తో సహ వైసీపీ నేతలంతా…వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడం ఖాయమని మాట్లాడారు. అలాగే 95 శాతం హామీలని అమలుచేశామని చెప్పారు…ఇక యథావిధిగానే..ప్లీనరీలో చంద్రబాబు పేరు ఎక్కువ వినిపించింది…అలాగే టీడీపీ అనుకూల మీడియా సంస్థలని టార్గెట్ చేశారు. విమర్శలు విషయం పక్కన పెడితే..95 శాతం హామీలని అమలు చేశామని అంటున్నారు…ఇందులో నిజం లేకపోలేదు…కాకపోతే పథకాలల్లో కోతలు విధించారనే సంగతి తెలిసిందే.

ఉదాహరణకు జగన్ ప్రతిపక్షంలో ఉండగా రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తానని అన్నారు..కానీ అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇచ్చే పి‌ఎం కిసాన్ రూ.6 వేలు కలుపుకుని..రూ.13,500 ఇస్తున్నారు…అంటే రూ. 7,500 మాత్రం ఏపీ ప్రభుత్వం ఇస్తుంది..లెక్క అయితే మొత్తం రూ.18,500 రావాలి. ఇలా పలు పథకాల్లో కోతలు ఉన్నాయి…సరే అన్నీ పథకాలు ఇస్తున్నప్పుడు కోతలు పెద్ద లెక్క కాదనే చెప్పొచ్చు. కాబట్టి పథకాల విషయం పక్కన పెడితే…వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలిచేస్తామని అంటున్నారు.

అసలు 175 సీట్లు గెలవడం సాధ్యమా? అంటే ఎప్పుడు ప్రజల ఏకపక్ష తీర్పుని ఇవ్వరనే చెప్పాలి. లోకల్ ఎన్నికల్లో అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి…కానీ సాధారణ ఎన్నికల్లో అలా ఉండదు..పైగా 2019 ఎన్నికలతో పోలిస్తే టీడీపీ ఇప్పుడు పుంజుకుంది..పైగా జనసేన పికప్ అవుతుంది…ఇక ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చు. టీడీపీ సింగిల్ గా కూడా వైసీపీకి గట్టి పోటీనే ఇచ్చే ఛాన్స్ ఉంది..ఇది ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం..ఎప్పుడైనా వాస్తవాలకు దగ్గరగానే రాజకీయం ఉండాలి…ఇప్పుడైతే వైసీపీకే లీడ్ ఉంది..కానీ టీడీపీ కూడా పుంజుకుంది. మరి ఎన్నికల నాటికి పరిస్తితి ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news