గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద రెండు రోజులపాటు జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాల గురించి నవరత్నాల పై నవ సందేహాలు అంటూ ఒక లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. గుంటూరులో జరిగిన రెండు రోజుల ప్లీనరీ చూసిన తరువాత నవరత్నాల గురించి వ్యాఖ్యానించిన వారు నవ రంద్రాలు మూసుకున్నారు అని ఎద్దేవా చేశారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సుమారు తొమ్మిది లక్షల మంది ప్లీనరీకి తరలివచ్చారని చెప్పారు. ప్లీనరీకి వచ్చిన ప్రజలను చూసి చంద్రబాబు నాయుడు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు అని ఆయన అన్నారు.
వైసీపీ ప్లీనరీ చరిత్రలో సువర్ణాధ్యాయం గా నిలిచిపోతుందని అన్నారు. టిడిపి మహానాడు లో తిట్టడం,తొడలు కొట్టడమే ప్రధానంగా జరిగేదని.. మా ప్లీనరీలో మూడేళ్లలో మేమేం చేసాము, రాబోయే రెండేళ్లలో ఏం చేస్తామో చెప్పామని విజయసాయిరెడ్డి అన్నారు. టిడిపి, జనసేనలకు 2024లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు.