విద్యాశాఖ మంత్రి కావలెను..టీ బీజేపీ సెటైరికల్ ట్వీట్

-

తెలంగాణలో విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను ప్రస్తావిస్తూ టీ బీజేపీ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసింది. స్కూల్స్ మొదలైన విద్యాశాఖ మంత్రి పత్తాలేడని తీవ్ర స్థాయిలో మండిపడింది.సరైన పర్యవేక్షణ లేక ఉద్యోగాలు భర్తీలు కాక, ప్రాథమిక విద్యాశాఖ కుదేలవడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనకు ఇదే అద్దం పడుతోందని విమర్శించింది.

ఈ ట్వీట్‌కు తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను.. అనే ఫొటోను జత చేసింది టీ బీజేపీ. విద్యాశాఖ మంత్రి పోస్ట్, 26 జిల్లాలకు డీఈవో పోస్టులు, డిప్యూటీ ఈవో పోస్టులు, 598 ఎంఈవో పోస్టులు, 22000 టీచర్ పోస్టులు, స్కేవెంజేర్ పోస్టులు గాడిద గుడ్డు అయ్యాయని టీ బీజేపీ సెటైర్లు వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news