నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 13వేల టీచర్ పోస్టుల భర్తీ

-

తెలంగాణ నిరుద్యోగులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ తన స్వగ్రామం అయినటువంటి  నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే 13వేల కొత్త టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.

బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ మరో మూడు నెలల్లో పూర్తి చేసి.. సాగునీటిని అందిస్తామన్నారు. గ్రామంలోని పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు,  ఇళ్లు మంజూరు చేస్తామని మాటిచ్చారు. బ్రాహ్మణవెల్లంలలో కొత్త పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక వసతులతో కొత్త పాఠశాల భవనం ఉంటుందని చెప్పారు. ఆ పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం చేయిస్తానని తెలిపారు. అలాగే గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news