ప్రీతి మృతి..ఇవాళ తెలంగాణలో విద్యాసంస్థలు బంద్

-

అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానన్న KCR..గడీ దాటింది లేదని ఫైర్‌ అయ్యారు వైఎస్‌ షర్మిల. మెడికల్‌ విద్యార్థి ప్రీతి మృతి చెందినట్లు ప్రకటించారు నిమ్స్ వైద్యులు. నిన్న రాత్రి 9:10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సంఘటనపై ABVP స్పందించింది. ప్రీతి మృతికి నిరసనగా ఇవాళ తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల బంద్‌ కు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ స్కూల్స్‌ తో పాటు.. కళాశాలలు బంద్‌ కానున్నాయి. అటు ఈ సంఘటనపై వైఎస్‌ షర్మిల స్పందించారు.

మెడికల్ స్టూడెంట్ డాక్టర్ ప్రీతి మృతి అత్యంత బాధాకరమని చెప్పారు షర్మిల. వేధింపులు, ర్యాగింగ్ భూతానికి ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. కేఎంసీ ప్రిన్సిపల్ గతంలోనే స్పందించి, ఉంటే ప్రీతి ప్రాణాలు దక్కేవన్నారు. అమ్మాయిలకు రక్షణ కల్పించడంలో KCR సర్కార్ విఫలం అయింది. అమ్మాయిల వంక చూస్తే గుడ్లు పీకేస్తానన్న KCR.. ఇంతవరకు గడీ దాటింది లేదని నిప్పులు చెరిగారు.

ర్యాగింగ్,వేధింపులతో బలైన మెడికొ ప్రీతీ ఆత్మహత్య, ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ విద్యా సంస్థల బంద్

1. మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జించే విచారణ జరిపించాలి.

2. రాష్ట్ర ప్రభుత్వం దారావత్ ప్రీతీ కుటుంబానికి న్యాయం చేయాలి.

3. మెడికో ప్రీతీ ఆత్మహత్యకు కారకుడైన సైఫ్,  కళాశాల అధికారులను కఠినంగా శిక్షించాలి.

4. రాష్ట్రంలో తరచూ వెలుగు చూస్తున్న ర్యాగింగ్ విష సంస్కృతిని నిషేధించేలా ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించాలి.

5. డాక్టర్ ప్రీతీ ఆత్మహత్యాయత్నం అనంతరం వైద్య విద్య కళాశాలలో ర్యాగింగ్ సాధారణం అని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలి.

ABVP- తెలంగాణ శాఖ

Read more RELATED
Recommended to you

Latest news