వెంకటేష్ తో నటించిన అంజలా ఝవేరి ఎలా ఉందో తెలుసా..?

-

టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి కొంతమంది మాత్రమే సక్సెస్ను అందుకున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అంజలా ఝవేరి కూడా ఒకరు. ఈతరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆ తరం ప్రేక్షకులు ఈమెను చూస్తే ఇట్టే గుర్తు పట్టేస్తారని చెప్పవచ్చు. టాలీవుడ్ లో హీరో వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాంరా సినిమాలో పక్కింటి అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది అంజలా ఝవేరి. తన మొదటి సినిమాతోనే తన నటనతో అందంతో అందరిని ఆకట్టుకుంది.

ఇక తర్వాత రెండవ సినిమాకి మెగాస్టార్ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చూడాలని ఉంది సినిమాలో నటించిన సౌందర్యం మొదటి హీరోయిన్ కాగా అంజలా ఝవేరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా రావోయి చందమామ, దేవి పుత్రుడు, ప్రేమ సందడి తదితర వంటి హిట్ చిత్రాలలో నటించింది.

తెలుగు తో పాటు ఈమె తమిళ్ ,కన్నడ, హిందీ వంటి చిత్రాలలో కూడా అలరించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది అంజలా ఝవేరి. అయితే ఈమె భర్త కూడా ఒక నటుడే. అతని పేరు తరుణ్ ఆరోరా.. టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలలో విలన్ గా నటించారు. ఆరోర కూడ తెలుగు ,కన్నడ, తమిళ్ భాషలలో ప్రస్తుతం విలన్ గా నటిస్తూ ఉన్నారు. హీరోయిన్గా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అంజలా ఝవేరి.. ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news