Eesha Rebba : ఇళయరాజా కన్సర్ట్‌లో ఈషా రెబ్బ.. ట్రెడిషనల్ ఔట్‌ఫిట్‌లో ఫొటోలు వైరల్

-

టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ కూడా అలరిస్తుంది. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ఈ భామ తనకంటూ కొంత పర్సనల్ టైం కేటాయిస్తోంది. తనకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ నిర్వహించిన లైవ్ కన్సర్ట్‌కు వెళ్లింది. హాయిగా ఆ కన్సర్ట్‌లో తన ఫేవరెట్ పాటలను ఎంజాయ్ చేసింది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఇళయరాజా లైవ్ కన్సర్ట్‌కు ఈషా హాజరైంది. ఈ ఈవెంట్‌కు ఈషా గోల్డెన్ కలర్ సల్వార్ కమీజ్‌లో వచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోల్డెన్ కలర్ ఔట్‌ఫిట్‌లో ఈషా చాలా అందంగా కనిపిస్తోంది.

ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు ఈషాపై మనసు పారేసుకుంటున్నారు. పంజాబీ డ్రెస్సులో కుందనపు బొమ్మలా ఉన్నావంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇంతందానికి తెలుగులో ఎక్కువగా ఆఫర్లెందుకు రావడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోల్లో ఈషా చాలా అందంగా ఉందంటూ కామెంట్లతో ఇన్‌బాక్స్‌ను నింపేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news