నాకు వెన్నుపోటు పొడిచిందే కేసీఆర్ : ఈటల

మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్‌ పై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తనకు వెన్నుపోటు పొడిచింది, ద్రోహం చేసింది సీఎం కేసీఆరేనని… టీఆర్‌ఎస్‌ పార్టీవి అన్ని చిల్లర రాజకీయాలేనని ఈటల రాజేందర్‌ నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగపూర్ లో ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం ఈటల మాట్లాడుతూ… హుజూరాబాద్ లో తెరాసా పార్టీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. మీటింగ్ కి పోవద్దు అని డబ్బులు ఇచ్చే దుర్మార్గ పరిస్థితికి దిగజారారని మండిపడ్డారు.

పిల్లిని రూంలో వేసి కొడితే తిరగబడుతుందని… ప్రజలు కూడా ఎక్కువ ఇబ్బంది పడితే వదిలి పెట్టరని హెచ్చరించారు. కెసిఆర్ వి అన్నీ అబద్ధాలు.. మోసాలేనని మండిపడ్డారు. ఇతర పార్టీ నుండి గెలిచాన వారికి మంత్రి పదవులు ఇస్తున్నారు అది అనైతికమన్నారు. పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉద్యమం కోసం వాడుకోన్న వ్యక్తి కెసిఆర్ అని… నన్ను కుడి భుజం, ఎడమ భుజం అని చెప్పి ద్రోహం చేశాడని నిప్పులు చెరిగారు. సీఎం పదవి కాళీ గోటితో సమానం అన్నది కెసిఆర్ అని… ప్రజలు మనని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే కెసిఆర్ దూర్మార్గం గా వ్యవహారిస్తున్నాడని నిప్పులు చెరిగారు ఈటల రాజేందర్‌.