పరిటాల రవి, కోడెల మృతి కారణం చంద్రబాబే : సునీత వ్యాఖ్యలకు వల్లభనేని కౌంటర్

టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల సునీత నిన్న చేసిన వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ కౌంటర్‌ ఇచ్చారు.తాను పరిటాల సునీతను వదినగానే చూస్తానని… తల్లికి.. గర్బస్థ శిశువుకు మధ్య గొడవలు పెట్టగలిగినంత తెలివైన వాడు చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి ఉంటుందని.. గవ్నవరానికో.. గుడివాడకో నేనూ, కొడాలి నాని మొదలు కాదు.. చివర కాదన్నారు. పరిటాల రవి చనిపోవడానికి.. కొడెల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే కారణమని ఆరోపించారు.

పరిటాల రవి చనిపోవడానికి తాను కారణం కాదని చంద్రబాబు.. దేవాన్ష్ మీద ఒట్టేయగలరా..? గన్నవరం నుంచి లోకేష్ పోటీ చేస్తానంటే.. నేను రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. వదిన పరిటాల సునీతే రాజీనామా పత్రం స్పీకరుకు పంపొచ్చని తెలిపారు. వదిన పరిటాల సునీత వచ్చి గన్నవరం సీటును గెలిపించుకుంటారేమో చూస్తానని… ఆమె కృష్ణ సారధ్యం చేస్తుందో.. శల్య సారధ్యం చేస్తుందో చూస్తానని వెల్లడించారు.

2014 లో కొడాలి నాని గెలిచారు ఆమె ఓడించ లేకపోయారు.. 2019లో ఆమె మంత్రిగా ఉన్నప్పుడే కొడాలి నానిని ఓడించ లేకపోయారని చురకలు అంటించారు. ఇప్పుడు నన్ను ఓడించే ప్రయత్నం పరిటాల సునీతను చేయమనండని సవాల్‌ విసిరారు. గతంలో నేను పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పుడు కూడా పరిటాల సునీత మా కుటుంబంతో సాన్నిహిత్యంగానే ఉన్నారని.. ఆమెకు ఇప్పుడే అంత కోపం ఎందుకు వచ్చింది..? అని ప్రశ్నించారు. చంద్రబాబు మనస్సులో మాటను ఆమెతో చెప్పించారంతేనని… చంద్రబాబు భ్రమలు కల్పించి మాట్లాడిస్తారన్నారు.