సిఎం కెసిఆర్ పై మరోసారి ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. సిఎం కెసిఆర్ అహంకారి అని.. ప్రజల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. తనకు తెలిసి ఎక్కడా.. కూడా తాను తప్పు చేయ లేదన్నారు. ఒక్క కరోనా కాలం తప్ప నిరంతరంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉన్నానని చెప్పుకొచ్చారు. 20 ఏళ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఉన్నానని.. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టల మీద పడుకున్నా.. ప్రజలంతా తనతో ఉన్నారన్నారు.
తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉందని… స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్. కెసిఆర్ అహంకారాన్ని గెలిపిస్తారా లేదా ఆ అహంకారంతో బలి అయ్యే పేద ప్రజల గొంతుక అయిన ఈటల రాజేందర్ ను గెలిపిస్తారా? అని వెల్లడించారు. ధర్మం పాతర వేయవద్దనే ఈ వర్షంలో కూడా పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు ఈటెల రాజేందర్. కులం పార్టీ కంటే జనం తో సంబంధం ఉందని.. ప్రజలంతా తన అండ అని పేర్కొన్నారు ఈటెల రాజేందర్.