ఏపీలో ఐఏఎస్ అధికారులు బ‌దిలీ.. సీఎం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా జ‌వ‌హ‌ర్‌రెడ్డి

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 8 మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుతం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవోగా విధులు నిర్వ‌హిస్తున్న కే.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డిని ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. త‌దుప‌రి ఉత్వ‌ర్వులు వ‌చ్చేంత వ‌ర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవోగానే జ‌వ‌హ‌ర్ రెడ్డి కొన‌సాగుతార‌ని.. ఉత్వ‌ర్వుల్లో పేర్కొంది.

ర‌వాణా శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా ఉన్న ఎం.టీ. కృష్ణ‌బాబుకు ర‌వాణాశాఖ క‌మిష‌న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్పగించారు. అట‌వీశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నీర‌బ్‌కుమార్ ప్ర‌సాద్‌, సీసీఎల్ఏగా జి.సాయిప్ర‌సాద్ బ‌దిలీ అయ్యారు. సాయి ప్ర‌సాద్‌కు రెవెన్యూ భూ రికార్డుల ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానూ పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను ప్ర‌భుత్వం అప్ప‌గించింది. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి స‌భ్య కార్య‌ద‌ర్శిగా జీఎస్ఆర్‌కేఆర్ విజ‌య్‌కుమార్ బ‌దిలీ అయ్యారు. జ‌ల‌వ‌న‌రుల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా శ‌శిభూష‌ణ్‌కుమార్, సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ హెచ్ఆర్ స‌ర్వీసుల విభాగం అద‌న‌పు బాధ్య‌త‌ల‌నూ శశిభూష‌ణ్ కుమార్ కు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఎక్సైజ్‌, స్టాంపులు రిజిస్ట్రేష‌న్ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ర‌జ‌త్ భార్గ‌వ బ‌దిలీ అయ్యారు. యువ‌జ‌న స‌ర్వీసులు, క్రీడ‌ల శాఖ అద‌న‌పు బాధ్య‌త‌ల‌నూ ర‌జ‌త్ భార్గ‌వ చూసుకోనున్నారు. ఏపీ డెయిరీ డెవ‌ల‌ప్‌మెంట్ ఎండీ ఏ. బాబుకు ఏపీపీఎస్సీ కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఏపీపీఎస్సీ కార్య‌ద‌ర్శి సీతారామాంజ‌నేయులు రిలీవ్ చేసి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. డీజీపీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి అవినీతి నిరోధ‌క శాఖ డీజీగా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. హెచ్ఓపీఎస్ అద‌న‌పు బాధ్య‌త‌లోనూ డీజీపీ కొన‌సాగుతార‌ని ఉత్వ‌ర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news